
బిర్గుంజ్, 06 జనవరి (హి.స.)ారత సరిహద్దును ఆనుకుని ఉన్న నేపాల్ లోని కొన్ని ప్రాంతాల్లో మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగాయి. దీంతో అక్కడ హై సెక్యూరిటీ అలర్ట్ జారీ అయింది. మతపరమైన కంటెంట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నేపాల్ లోని పర్సా జిల్లాలోని బిర్గుంజ్ పట్టణంలో నిరసన మొదలయ్యాయి. ఇవి క్రమంగా హింసాత్మకంగా మారాయి. బిహార్ లోని రక్సౌల్ జిల్లా సరిహద్దుకు ఆనుకుని ఉన్న బిర్గుంజ్ నగరంలో పర్సా జిల్లా యంత్రాంగం కర్ఫ్యూ విధించింది. నిరసనలు, ఆందోళనల నేపథ్యంలో భారత్ నేపాల్ తో పంచుకుంటున్న సరిహద్దులను పూర్తిగా మూసివేసింది. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..