
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11pt;}.cf3{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ.,06,జనవరి (హి.స.)2026 పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ వచ్చేసింది. జనవరి 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసగించనున్నారు. ఇక ఫిబ్రవరి 1న (ఆదివారం) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. నిర్మలమ్మ గత సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. 2017లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 1 (ఆదివారం) వచ్చింది. అయితే ఆదివారం బడ్జెట్ ప్రవేశపెడతారా? లేదా? అన్న సందిగ్ధం నెలకొంది. మొత్తానికి ఆదివారమే బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.
ఇక 2026 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనా రూ.11 లక్షల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లకు పెద్ద పీట వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ