
ఢిల్లీ, 06 జనవరి (హి.స.)HPCL విశాఖ రిఫైనరీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. భారత ఇంధన భద్రతకు ఈ రిఫైనరీ మరింత వేగాన్ని ఇస్తుందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ సాకారం చేసే దిశగా దోహదపడుతుందని పేర్కొన్నారు. తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. తన పోస్టులో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ ట్వీట్ ను షేర్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి విశాఖ రిఫైనరీ విషయమై కీలక వ్యాఖ్యలను తన ఎక్స్ ఖాతా వేదికగా చేసిన విషయం విదితమే.
విశాఖపట్నం కేంద్రంగా భారతదేశ ఇంధన రంగంలో సరికొత్త చరిత్ర లిఖించబడిందని.. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) తన విశాఖ రిఫైనరీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 'రెసిడ్యూ అప్‌గ్రేడేషన్ ఫెసిలిటీ' (RUF)ని విజయవంతంగా ప్రారంభించిందని కేంద్రమంత్రి పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కిందన్నారు. ఇంధన భద్రతను పెంపొందించడం ద్వారా 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇది ఒక కీలక ముందడుగుగా కొనియాడారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV