
ఢిల్లీ, 06 జనవరి (హి.స.)మెట్రో క్వార్టర్స్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకొని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ సంఘటన ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) స్టాఫ్ క్వార్టర్స్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని వారంత ఒకే కుటుంబానికి చెందిన వారిగా అధికారులు తెలిపారు. ఈ ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు తెల్లవారుజామున 2:45 గంటల సమయంలో ప్రమాద స్థలికి చేరుకున్నారు.
వెంటనే ఆరు ఫైర్ ఇంజన్ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని అజయ్ (42), ఆయన భార్య నీలం (38), వారి పదేళ్ల కుమార్తె జాన్విగా గుర్తించారు. ప్రమాద సమయంలో వీరంతా గాఢ నిద్రలో ఉండడం వల్ల మంటల నుంచి తప్పించుకోలేక పోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు వెల్లడించారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV