
విశాఖపట్టం, 04 జనవరి (హి.స.)
విశాఖ నగరంలో (Vizag) రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో (Accidents) ఇద్దరికి గాయాలయ్యాయి. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. పోలీసులు వివరాల ప్రకారం గాజువాక (Gajuwaka) పోలీసు స్టేషన్ వద్ద ఓ టిప్పర్ ఆగి ఉంది. అటుగా వెళ్తున్న ఓ కాంక్రీట్ లారీ ఆగి ఉన్న ఆ టిప్పరును ఢీకొట్టింది. దీంతో కాంక్రీట్ లారీ ముందు భాగం ధ్వంసం అయ్యింది. దాన్ని నడిపిస్తున్న డ్రైవర్ లారీలోని క్యాబినులో చిక్కుకుపోయాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలకు దిగారు. ముందుగా కేబిన్ లో చిక్కుకున్న డ్రైవరును బయటకు తీశారు. అతన్ని చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
..
మరో రోడ్డు ప్రమాదం కొత్తగాజువాకలోని (Kotha Gajuwaka) రైతు బజార్ సమీపంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం కూరగాయలు విక్రయించే ఓ మహిళ (Women) రైతు బజార్ సమీపంలో రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో మహిళ రోడ్డు దాటుతున్న విషయాన్ని అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సు డ్రైవరు గమనించలేదు. దీంతో మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. బస్సు బలంగా ఢీకొట్టడంతో సదరు మహిళకు గాయాలయ్యారు. చెయ్యి నుజ్జునుజ్జు కావడంతో ఆమె ఆర్తనాదాలు పెట్టింది. ప్రమాదాన్ని గమనించిన ట్రాఫిక్ పోలీసులు సత్వరమే స్పందించారు. బాధిత మహిళను సమీపంలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV