అంబర్పేట్లో అంతులేని విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.) హైదరాబాద్ నగరం నడిబొడ్డున అంతులేని విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మృతులను రామ్ రాజ్ (55), ఆయన భార్య మాధవి (50), కుమారుడు శశాంక్ (24
Suicide


హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.) హైదరాబాద్ నగరం నడిబొడ్డున అంతులేని విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మృతులను రామ్ రాజ్ (55), ఆయన భార్య మాధవి (50), కుమారుడు శశాంక్ (24)గా పోలీసులు గుర్తించారు.

వివరాల్లోకి వెళితే.. అంబర్పేట్ (Amberpet)లోని తమ నివాసంలో రామరాజు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు వెంటనే సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వారు తలుపులు పగులగొట్టి చూడగా.. ముగ్గురు విగతజీవులుగా పడిపోయి కనిపించారు. వారి మృతికి ఆర్థిక ఇబ్బందులా లేక అనారోగ్య సమస్యలా అయి ఉంటాయా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఘటనా స్థలాన్ని అంబర్పేట్ పోలీసులు క్లూస్ టీమ్ (Clues Team)తో రంగంలోకి దింపి ప్రాథమిక ఆధారాలను సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande