
హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.)
హైదరాబాద్ మహానగరంలో యువకుడి దారుణ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ (Rajendra Nagar) పరిధిలో శనివారం అర్థరాత్రి హిమాయత్ సాగర్ (Himayath Sagar) సమీపంలో ఓ యువకుడి మృతదేహం లభ్యం కావడంతో హాట్ టాపిక్గా మారింది. వివరాల్లోకి వెళితే.. టోలిచౌకి (Tolichawki) ప్రాంతానికి చెందిన మహమ్మద్ అమీర్ (Mohammad Amir) అనే యువకుడి మృతదేహాన్ని స్థానికులు హిమాయత్ సాగర్ పరిసరాల్లో కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. డెడ్బాడీ పాక్షికంగా కాలిపోయిన స్థితిలో ఉంది.
అయితే, మహ్మద్ అమీర్ను గుర్తు తెలియని వ్యక్తులు పథకం ప్రకారం హత్య చేసి, ఆపై ఆధారాలు మాయం చేసేందుకు పెట్రోల్ పోసి తగులబెట్టారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడింది ఎవరనే కోణంలో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం (Postmortem) నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు