
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ.,06,జనవరి (హి.స.)ఇరాన్ (Iran)లో హింసాత్మక నిరసనలు చోటుచేసుకుంటున్నందున భారత పౌరులు ఆ దేశానికి ప్రయాణాలు మానుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖ (MEA) సోమవారంనాడు అడ్వయిజరీ జారీ చేసింది. ఇరాన్‌లోని భారత పౌరులు తగిన జాగ్రతలు తీసుకోవాలని, నిరసన ప్రదర్శనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని, స్థానిక అధికారులు, వార్తా సంస్థల అప్‌డేట్స్‌ను ఎప్పుటికప్పుడు ఫాలో కావాలని సూచించింది. అలాగే టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారిక వెబ్‌సైట్, సోషల్ మీడియా ఛానెల్స్ నుంచి సమాచారం చెక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ