
హైదరాబాద్, 07 జనవరి (హి.స.) రైల్వే రంగంలో మరో కీలక ఘట్టానికి మోడీ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ఇండియాలో తొలి హైడ్రోజన్ రైలు పట్టాలెక్కనుంది. ఈ మేరకు హర్యానాలో ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఉత్తర రైల్వే ఆధ్వర్యంలో రూపొందిన ఈ తొలి హైడ్రోజన్ రైలు, జింద్ - సోనీపత్ మధ్య పరుగులు తీయనుంది.
ఈ రైలుకు ఇంధనం అందించడానికి జింద్ లో ప్రత్యేకంగా హైడ్రోజన్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. ఇక గణతంత్ర దినోత్సవం అంటే జనవరి 26వ తేదీన ఈ హైడ్రోజన్ రైలు ట్రయల్ రన్ ప్రారంభం కానుంది. గంటకు 150 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పట్టాలపై పరుగులు తీసే సామర్థ్యం ఉన్న ఈ హైడ్రోజన్ రైలు ట్రయల్ రన్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే ఛాన్స్ ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు