ఇండియన్ సినిమాలకు అంతర్జాతీయ గుర్తింపు.. ఆస్కార్ బరిలో కాంతార, మహావతార్ నరసింహ
హైదరాబాద్, 09 జనవరి (హి.స.) భారతీయ సినిమాలు మరోసారి ప్రపంచ వేదికపై సత్తా చాటుతున్నాయి. ఆస్కార్ 2026 రేసులో మన దేశానికి చెందిన చిత్రాలు కీలకమైన జనరల్ ఎంట్రీ (Eligibility List)లో చోటు దక్కించుకోవడం సినీ అభిమానులను గర్వంతో ఉప్పొంగేలా చేస్తోంది. రి
ఆస్కార్ బరిలో కాంతార


హైదరాబాద్, 09 జనవరి (హి.స.)

భారతీయ సినిమాలు మరోసారి ప్రపంచ వేదికపై సత్తా చాటుతున్నాయి. ఆస్కార్ 2026 రేసులో మన దేశానికి చెందిన చిత్రాలు కీలకమైన జనరల్ ఎంట్రీ (Eligibility List)లో చోటు దక్కించుకోవడం సినీ అభిమానులను గర్వంతో ఉప్పొంగేలా చేస్తోంది.

రిషబ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ చిత్రం 'కాంతార: చాప్టర్-1'తో పాటు యానిమేషన్ వండర్ 'మహావతార్ నరసింహ' చిత్రాలు ఆస్కార్ జనరల్ ఎంట్రీ జాబితాలో నిలిచాయి.

ఈ రెండు చిత్రాలు కేవలం ఉత్తమ చిత్రంగానే కాకుండా.. ఉత్తమ నటుడు, నటి, దర్శకుడు, స్క్రీన్ప్లే, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ వంటి ప్రధాన కేటగిరీలన్నింటిలోనూ పోటీ పడనున్నాయి. ఈ విషయాన్ని హోంబలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటిస్తూ.. 'మేము ఆస్కార్కు మరో రెండు అడుగుల దూరంలో ఉన్నాం' అంటూ ఎక్స్ వేదికగా తమ సంతోషాన్ని పంచుకుంది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande