
అమరావతి, 01 అక్టోబర్ (హి.స.)
చీపురుపల్లి నియోజకవర్గం మెరకముడుదాం మండలం గర్భాం గ్రామంలో గురువారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
కలెక్టర్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సేవలు అందించాలని ఆయన సూచించారు.
లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పింఛన్ల పంపిణీని సజావుగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఆర్డీఏ పథక సంచాలకుడు శ్రీనివాస పాణి, అధికారులు, కూటమి నాయకులు ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ