
తిరుమల , 01 అక్టోబర్ (హి.స.)తిరుమలలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1, అక్టోబర్ 5 తేదీల్లో VIP బ్రేక్ దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. పురట్టాసి మాసం, సెలవుల కాలం కారణంగా తిరుమలకు వచ్చే సాధారణ భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో దర్శన నిర్వహణను సులభతరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది.
సాధారణంగా VIP బ్రేక్ దర్శనం సమయంలో పరిమిత సంఖ్యలో ప్రత్యేక దర్శనాలు నిర్వహిస్తారు. అయితే భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సందర్భాల్లో సాధారణ భక్తులకు వేచి ఉండే సమయం పెరగకుండా, దర్శన వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. అందుకే అక్టోబర్ 1, 5 తేదీల్లో VIP బ్రేక్ దర్శనాన్ని రద్దు చేయాలని టీటీడీ నిర్ణయించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్