దుర్గాదేవి మండపాల ఏర్పాటుకు ఆన్లైన్ దరఖాస్తు తప్పనిసరి.. ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ
దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాలను నిర్వాహకులు శాంతియుతంగా జరుపుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితిక పంత్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
SP


ఆసిఫాబాద్, 10 అక్టోబర్ (హి.స.)

దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాలను నిర్వాహకులు శాంతియుతంగా జరుపుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితిక పంత్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవి మండపం వద్ద భద్రత చర్యల్లో భాగంగా 24 గంటలు వాలంటరీలతో పాటు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసుకోవాలని రాత్రి 10 దాటిన తర్వాత మైక్, సౌండ్ సిస్టమ్, డీజేలు వినియోగించొద్దని అలాగే ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం.. వివాదాస్పద పాటలు లేదా రెచ్చగొట్టే అంశాలను ప్రసారం చేయొద్దని కోరారు. మండపాల ఏర్పాటుకు ఆన్లైన్ దరఖాస్తు తప్పనిసరి అన్నారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande