రేడియల్ రోడ్-2 టెండర్లలో భారీ స్కాం.. కేటీఆర్
రూ.3,296 కోట్ల విలువైన రేడియల్ రోడ్-2 టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
Ktr


హైదరాబాద్, 10 అక్టోబర్ (హి.స.)

రూ.3,296 కోట్ల విలువైన రేడియల్ రోడ్-2 టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

బుద్వేల్ నుంచి కొడంగల్ వరకు కొత్తగా చేపట్టనున్న గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే నిర్మాణ పనుల్ని ప్యాకేజీలుగా, ముక్కలుగా విభజించి ముందస్తుగా నిర్ణయించుకున్న నచ్చిన వారికే టెండర్లు కట్టబెట్టారని మండిపడ్డారు.

తక్కువ ధరకు బిడ్లు వేసిన అర్హులైన సంస్థలను పక్కన పెట్టి, సాంకేతిక కారణాల పేరుతో ఇతరులను తొలగించి, ఎక్కువ ధరకు కోట్ చేసిన కంపెనీలకు పనులు కేటాయించడం ద్వారా వందల కోట్ల ప్రజాధనం వృధా అవుతోందని విమర్శించారు.

వెంటనే ఈ టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని, టెండర్ల తాలూకు అన్ని పత్రాలను బహిరంగపరచాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బిడ్ ఓపెనింగ్, కంపారేటివ్ స్టేట్మెంట్లు, మూల్యాంకన కమిటీ సమావేశాల మినిట్స్తో కూడిన రికార్డులను బయటపెట్టాలన్నారు. రూ.600 కోట్ల ఆర్థిక నష్టం ఆరోపణలపై సమగ్ర పరిశీలన జరిపించాలని, హెచ్ఎండీఏ, హెచ్ జీసీఎల్ పరిధిలోని రూ.100 కోట్లకు పైబడిన కాంట్రాక్టులపై కాగ్ (CAG)తో ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande