ఏపీలో దసరా సెలవుల ప్రకటన – నేటి నుంచే పాఠశాలలకు వేసవి విరామం
విజయదశమి (దసరా) పండుగ వేళ ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలకు ప్రభుత్వం అధికారికంగా సెలవులను ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు నేటి నుంచి దసరా సెలవులు అధికారికంగా ప్రారంభమయ్యాయి.
School


అమరావతి , 10 అక్టోబర్ (హి.స.)విజయదశమి (దసరా) పండుగ వేళ ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలకు ప్రభుత్వం అధికారికంగా సెలవులను ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు నేటి నుంచి దసరా సెలవులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 21 వరకు విద్యార్థులకు సెలవులు కొనసాగుతాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. సుదీర్ఘంగా దొరికిన ఈ సెలవులతో విద్యార్థులు తమ కుటుంబసభ్యులతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకునే అవకాశం లభించింది.

మళ్లీ అక్టోబర్ 22న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఊళ్ల బాట పట్టారు. పండుగ వాతావరణంతో రాష్ట్రంలో సందడి నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande