చరిత్రలో అక్షరం శాశ్వతంగా నిలుస్తుంది : హరీష్ రావు
సిద్దిపేట జిల్లా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో కవి సమ్మేళనం నిర్వహించారు.
Harish Rao


సిద్దిపేట, 10 అక్టోబర్ (హి.స.)

సిద్దిపేట జిల్లా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో కవి సమ్మేళనం నిర్వహించారు. కవి సమ్మేళనంలో జిల్లాకు చెందిన పలువురు కవితలను వినిపించారు.

ఈ కవి సమ్మేళనంలో మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ...చరిత్రలో అక్షరం శాశ్వతంగా నిలుస్తుందని అన్నారు. స్వచ్ఛత పరిశుభ్రత ఇలా అనేక అంశాల్లో సిద్దిపేట జిల్లా జాతీయ, రాష్ట్ర స్థాయిలో అవార్డు దక్కించుకుందన్నారు. 1969 ఉద్యమం మలిదశ తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట కు ప్రత్యేక స్థానం ఉందన్నారు.

సిద్దిపేట జిల్లా ఏర్పాటుకు ముందు.. ఏర్పాటైన తర్వాత అంశాలే ప్రాధాన్యత కవులు చెప్పిన కవితలను అచ్చు వేయించి భావితరాలకు సిద్దిపేట చరిత్రను అందిస్తా అన్నారు.

ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష లైన జిల్లా కేంద్రం, రైలు, గోదావరి జలాలను సాధించుకున్నట్లు తెలిపారు. మరో పదేళ్లలో సిద్దిపేట జిల్లా కేంద్రంగా యూనివర్సిటీ, క్యాన్సర్, గుండె జబ్బులకు సంబంధించిన ఆసుపత్రుల ఏర్పాటుకు కృషి చేస్తా అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande