
హైదరాబాద్ , 10 అక్టోబర్ (హి.స.)ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (SIR), ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్పై విమర్శల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో చర్చ కొనసాగుతోంది. ఓటు హక్కుకు సంబంధించిన అంశాన్ని రాజకీయ పార్టీలు ప్రాధాన్యంగా తీసుకోవడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నాయకుడు హరీశ్ రావు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓటు హక్కును కాపాడటం, ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం నిలబెట్టడం ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన అంశాలని వారు పేర్కొన్నారు.
మరోవైపు, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు బి. మహేశ్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ వైఖరిని ప్రశ్నించారు. ఓటర్ల జాబితా నుంచి అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించే అవకాశం ఉందన్న ఆరోపణలపై బీఆర్ఎస్ తగిన స్థాయిలో స్పందించడం లేదని ఆయన విమర్శించిచారు. బీఆర్ఎస్ మౌనం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్