
అమరావతి, 10 అక్టోబర్ (హి.స.)బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
జగన్ ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగకూడదని, బీసీల హక్కుల హరించడానికి తన మనుషులతో కోర్టులో కేసులు వేయించారని ఆరోపించారు. అన్ని సర్వేలు వైసీసీ రోజురోజుకు దిగజారిపోతుందని చెబుతున్నాయని అందుకే కుట్ర చేస్తున్నారని చెప్పారు. వైసీపీకి పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకడంలేదని, పోటీ చేయాలని అభ్యర్థులను కూడా బెదిరిస్తున్నారని అన్నారు.బీసీలకు రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, వారి హక్కులు, సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. బీసీల రిజర్వేషన్ల అంశంపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, గతంలో తీసుకున్న నిర్ణయాలకు వారే సమాధానం చెప్పాలని కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV