
అమరావతి, 10 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ అత్యవసర సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.తీసుకుంది.
ఈ రోజు శనివారం జరిగిన ఏపీ కేబినెట్ (AP Cabinet ) సమావేశంలో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ( BC Reservation ) ఖరారుకు ఆమోద ముద్ర వేసింది. మొత్తం 8 కేటగిరిల్లో రిజర్వేషన్లను ఖరారు చేసింది.
రిజర్వేషన్ల వివరాలను మంత్రి అచ్చెన్నాయుడు మీడియాకు వెల్లడించారు.పంచాయతీ వార్డు మెంబర్స్లో బీసీలకు 26.73 శాతం, సర్పంచు స్థానాలకు బీసీలకు 27.95 శాతం, ఎంపీటీసీ స్థానాలకు బీసీలకు 25.55 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. ఎంపీపీలో బీసీలకు 24.60 శాతం, జడ్పీటీసీ 24.60 శాతం, జడ్పీ చైర్మన్ 23.08, అర్బన్ వార్డుల్లో 32.78 శాతం, మున్సిపల్ చైర్మన్లలలో 33.02 శాతం మేర బీసీలకు రిజర్వేషన్లు , మేయర్లలో 35.29 శాతం రిజర్వేషన్లను ఏపీ కేబినెట్ ఖరారు చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV