మోడీ ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నాడు: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
ప్రధాని నరేంద్రమోడీపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్
షర్మిల


అమరావతి, 10 అక్టోబర్ (హి.స.)పేదవాడికి ఓటు వజ్రాయుధం అని ఆ హక్కును హరిస్తారా అంటూ ప్రధాని నరేంద్రమోడీపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

చలో రాజ్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన తనను హౌస్ అరెస్ట్ చేయడంపై షర్మిల మండిపడ్డారు.ఈ రాష్ట్రంలో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అవకాశం లేదా అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిలదీశారు.

‘నన్ను హౌజ్ అరెస్ట్ చేయించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి న్యాయమా? నిరసన వ్యక్తం చేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు. కత్తులు, రాళ్లు మా దగ్గర లేవు. శాంతియుతంగా రాజ్ భవన్కి వెళ్ళాలి అనుకున్నాం. ప్రజాస్వామ్యం బ్రతకాలి అంటే ఓటు ఉండాలి. ఇలాంటి ఓటు హక్కును బీజేపీ ప్రభుత్వం తొలగిస్తుంది’అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు.

ఫారం 6, ఫారం 7లను మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది అని మండిపడ్డారు. మోడీ అంటే మర్డర్ ఆఫ్ డెమెుక్రటిక్ ఆఫ్ ఇండియాగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అభివర్ణించారు.గత కొద్దికాలంలోనే 13 కోట్ల 40 ఓట్లు తొలగించారంటే ప్రజాస్వామ్యం బతుకుందా అని అన్నారు. ఏ ప్రక్రియలో అయినా ఎలిమినేషన్ చేస్తే 1 లేదా 2శాతం ఓట్లు తొలగిపోయతాని కానీ 14శాతం ఓట్లు కోల్పోవడం ఏంటని ప్రశ్నించారు. ఓటు హక్కు తొలగిస్తే పేదలు ఎవరికి తమ గోడు చెప్పుకోవాలని అడిగారు. తొలగించిన ఓట్లు అన్నీ దళితులవి, ముస్లీంలవి, పేదవారివేనని అన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఓట్ల చోరీపై ప్రతి ఒక్కరూ గళమెత్తాలని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande