ఏపీలో తేలికపాటి జల్లులు
అమరావతి , 12 అక్టోబర్ (హి.స.)తెలుగురాష్ట్రాలకు వాతవారణ శాఖ కీలక సూచనలు జారీ చేసింది.దక్షిణ భారతదేశంలో నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రక్రియ కొనసాగుతుండటంతో పాటు, ఈశాన్య రుతుపవనాల రాకకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. రైతుతి రుపవనాల నిష్క్రమణ, ఈశ
karnataka-weather-heavy-rain-forecast-in-five-districts-bengaluru-thunderstorms


అమరావతి , 12 అక్టోబర్ (హి.స.)తెలుగురాష్ట్రాలకు వాతవారణ శాఖ కీలక సూచనలు జారీ చేసింది.దక్షిణ భారతదేశంలో నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రక్రియ కొనసాగుతుండటంతో పాటు, ఈశాన్య రుతుపవనాల రాకకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి.

రైతుతి రుపవనాల నిష్క్రమణ, ఈశాన్య రుతుపవనాల రాకకు అనుకూల పరిస్థితుల ఉన్న నేపథ్యంలో తెలుగురాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని అంచానా వేసింది.

ఆంధ్రప్రదేశ్లో వాతావరణంఆంధ్రప్రదేశ్లో వాతావరణ ప్రభావం కాస్త భిన్నంగా ఉండనుంది. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.ఉదయం వేళ చాలా ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని, మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు పెరిగి.. ఎండ వేడి ఉక్కపోత ఉంచే ఛాన్స్ ఉందని తెలిసింది. అలాగే సాయంత్రం వేలల్లో మేఘాకృతమైన మేఘాలు కమ్ముకుంటాయని.. తద్వరా చల్లటి వాతావరణం ఏర్పడే ఛాన్స్ ఉందని తెలిపింది.

ఇక, తెలంగాణ నుంచి నైరుతి రుపువనాలు పూర్తిగా నిష్ర్కమించడంతో రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంది.అయితే, వాతావరణంలో స్థానిక మార్పుల కారణంగా ఒకటిరెండు దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశముంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి రెండు డిగ్రీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో మధ్యాహ్న సమయాల్లో వేడి, ఉక్కపోత ప్రభావం కనిపిస్తుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande