ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న విశాఖపట్నం ఎంపీ భరత్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ గాయత్రి దేవి రూపంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను ఎంపీ భరత్ దర్శించుకుని ,అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
MP


విజయవాడ, 12 అక్టోబర్ (హి.స.)విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ గాయత్రి దేవి రూపంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను ఎంపీ భరత్ దర్శించుకుని ,అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

ఆలయానికి వచ్చిన ఎంపీకి అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి, వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు.

దుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. దసరా ఏర్పాట్లు చాలా బాగున్నాయి. దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాను.ఇప్పటికే హైదరాబాద్‌లో బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది పేదలకు వైద్యం అందుతుందని వెల్లడించారు. ఇప్పుడు విజయవాడలో క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభించి పేదలకు వైద్యం అందించేందుకు శ్రీకారం చుట్టామని ఉద్ఘాటించారు. నందమూరి బాలకృష్ణ ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని ఎంపీ భరత్ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande