దసరా ఉత్సవాల రెండవ రోజు గాయత్రీ దేవి దర్శనం కోసం భక్తులు
దసరా నవరాత్రులు రెండో రోజు అలంకారం.. కనకదుర్గమ్మ గాయత్రీ దేవి అలంకారం విశిష్టత
దసరా ఉత్సవాల రెండవ రోజు గాయత్రీ దేవి దర్శనం కోసం భక్తులు


విజయవాడ, 12 అక్టోబర్ (హి.స.)విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈరోజు (సోమవారం) గాయత్రీ దేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తున్నారు.

ఈ రూపంలో అమ్మవారు శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి ఉంటుంది. ఆదిశంకరాచార్యుల వారు ఆరాధించిన గాయత్రీ దేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే ఉపాసనాబుద్ధి తేజోవంతం అవుతుందని పండితులు చెబుతారు.

విజయవాడ కనకదుర్గమ్మ దర్శించుకోవడానికి ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఆలయ చైర్మన్, ఈవో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం అన్ని దర్శన క్యూలైన్లలో ఉచిత దర్శనానికి ఏర్పాట్లు చేశారు. నూతన పూజా మండపంలో కుంకుమార్చన పూజలు ప్రారంభమయ్యాయి. యాగశాలలో శాస్త్రోక్తంగా చండీ హోమం ప్రారంభ పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు సౌకర్యవంతంగా అమ్మవారి దర్శనం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande