నేడు విజయవాడకు రాష్ట్రపతి ముర్ము....ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనం
రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆమె రాష్ట్రానికి విచ్చేస్తున్నారు. ఈ రోజు బుధవారం సాయంత్రం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న రాష్ట్రపతి, విజయవాడ పరిసర ప్రాంతాల్లో పలు అధికారిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో
రాష్ట్రపతి


విజయవాడ, 14 అక్టోబర్ (హి.స.)

రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆమె రాష్ట్రానికి విచ్చేస్తున్నారు. ఈ రోజు బుధవారం సాయంత్రం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న రాష్ట్రపతి, విజయవాడ పరిసర ప్రాంతాల్లో పలు అధికారిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

విమానాశ్రయా నుంచి రోడ్డు మార్గాన ఇంద్రకీలాద్రికి చేరుకుని, కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంటారు. రాత్రికి నోవాటెల్ హోటల్లో బస చేస్తారు. రేపు గురువారం ఉదయం 11 గంటలకు పున్నమి ఘాట్లో జరిగే ‘జాతీయ సరస్ ఆజీవిక మేళా-2026’ను సందర్శించి.. దానిని అధికారికంగా ప్రారంభిస్తారు.

మధ్యాహ్నం 1.10 నుంచి 2.10 వరకు డ్వాక్రా మహిళలు, లఖ్పతి దీదీలతో రాష్ట్రపతి భోజనం చేస్తూ ముచ్చటిస్తారు. మధ్యాహ్నం 2.45కి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. రాష్ట్రపతి పర్యటనలో సీఎం చంద్రబాబు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు.

రాష్ట్రపతి రాకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం మరియు పోలీసు శాఖ విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశాయి.

రాష్ట్రపతి పర్యటన బ్లూ బుక్ నిబంధనలకు అనుగుణంగా సజావుగా, సురక్షితంగా సాగేందుకు పలు శాఖల ఉన్నతాధికారులకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కీలక బాధ్యతలను అప్పగించారు.

గన్నవరం విమానాశ్రయం నుంచి ఇంద్రకీలాద్రి, పున్నమి ఘాట్, నోవాటెల్ హోటల్ పరిసర ప్రాంతాలు మరియు కాన్వాయ్ ప్రయాణించే ప్రధాన రహదారుల వెంబడి దాదాపు 2,000 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే కేంద్ర నిఘా విభాగం (IB), ఎస్ఎస్బీ సమన్వయంతో అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్ (ASL) సమీక్షలు నిర్వహించాయి. పోలీసులు ప్రత్యేకంగా కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించి భద్రతా పరమైన లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ మళ్లింపులు కూడా అమలు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande