ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సిద్ధమైంది. బుధవారం ఉదయం 11:30 గంటలకు విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఎస్ఈసీ కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్థానిక ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయనున్నారు.
Vote

అమరావతి, 14 అక్టోబర్ (హి.స.)

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సిద్ధమైంది. బుధవారం ఉదయం 11:30 గంటలకు విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఎస్ఈసీ కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్థానిక ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయనున్నారు.

అదే సమయంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను కూడా జారీ చేయనున్నారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల కోసం ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నెల 21లోపు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఈ నెల 28న పోలింగ్ నిర్వహించి, 30న ఓట్ల లెక్కింపు చేపట్టే అవకాశమున్నట్లు సమాచారం. మరోవైపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 19న నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఎన్నికల కోసం ఈ నెల 21 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరణ, 27 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం. నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టే అవకాశముందని తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande