
రంగంపేట, 14 అక్టోబర్ (హి.స.)భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు బుధవారం విజయవాడలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ప్రసిద్ధ ఇంద్రకీలాద్రిని సందర్శించి, కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోనున్నారు.ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో తూర్పుగోదావరి జిల్లా రంగంపేట గ్రామానికి చెందిన సైకతశిల్పి దేవిన శ్రీనివాస్, తన కుమార్తెలు దేవిన సిస్టర్స్ సోహిత, ధన్యతలతో కలిసి ఈ సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు.
ఈ శిల్పంలో సుమారు 20 రకాల పండ్లు, కూరగాయలను ఉపయోగించి అమ్మవారిని అలంకరించారు.
.రంగంపేటలో ఏర్పాటు చేసిన ఈ సైకత శిల్పాన్ని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపించారు. ఇసుకతో ఇంతటి సున్నితమైన ముఖకవళికలను రూపొందించడం వెనుక కళాకారుడి నైపుణ్యం కనిపిస్తోందంటూ పలువురు ప్రశంసించారు.
.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV