
శ్రీశైలం , 14 అక్టోబర్ (హి.స.)ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా.. కన్నులపండుగగా జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా నాలుగవ రోజైన ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు జగన్మాత శ్రీ భ్రమరాంబికా అమ్మవారు కూష్మాండ దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
అంటే తనకున్న శక్తిలో ఈ విశ్వాన్ని సృష్టించిన తల్లి అని అర్థం. కూష్మాండ రూపంలో ఉన్న ఈ అమ్మవారిని పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, శక్తి సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ అమ్మ వారి అలంకారాన్ని పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
పులివాహనంపై కూర్చుని దర్శనమిచ్చే కూష్మాండ దుర్గ..ఎనిమిది చేతుల్లో విల్లు , బాణం, చక్రం, గద, కమలం, జపమాల, కమండలం,అమృత కలశం ఉంటుంది. ఈ అమ్మవారికి గుమ్మడికాయ బలి ప్రీతికరం.
తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దేవి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగుతుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కూష్మాండ
అలంకారంలో ఉన్న అమ్మవారికి పలురకాల పూలతో అలంకరించి బిల్వాదళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు వేదపండితులు వేదమంత్రాలతో మంగళవాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులిచ్చారు
అలానే మల్లికార్జునస్వామి అమ్మవారు మయూర వాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూరహారతులిచ్చరు అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి బయలుదేరగా ఉత్సవమూర్తుల ముందు కోలాటాలు,చెక్క భజనలు, కేరళ నృత్యాలు, వాయిద్యాలు,గిరిజనుల నృత్యాలు,వివిధ రకాల గిరిజన నృత్యాలు వివిద రకాల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV