హర్యానాలో కాశ్మీర్ బస్సుపై దుండగుల దాడి.. ఇద్దరికి గాయాలు
హర్యానాలో కాశ్మీర్ బస్సుపై దుండగుల దాడి.. ఇద్దరికి గాయాలు
kashmir


కురుక్షేత్ర:, 18 అక్టోబర్ (హి.స.)

హర్యానాలో జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ప్రయాణికుల బస్సుపై కొందరు దుండగులు ఇటుకలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

ఢిల్లీ నుండి శ్రీనగర్ వెళ్తున్న లగ్జరీ స్లీపర్ బస్సు హర్యానాలోని కురుక్షేత్ర ప్రాంతానికి చేరుకున్న సమయంలో ఈ అటాక్ జరిగింది. బస్సు నంబర్ ప్లేట్ జే అండ్ కే (J&K) రిజిస్ట్రేషన్‌తో ఉండటాన్ని గమనించిన దుండగులు, ఉద్దేశపూర్వకంగానే ఈ దాడికి తెగబడ్డారని డ్రైవర్ ఆరోపించారు. తమను ఉగ్రవాదులంటూ దూషిస్తూ కర్రలు, రాళ్లతో దాడి చేశారని ఆయన తెలిపారు.

ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (NC) పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా ఒక ద్వేషపూరిత నేరమని (Hate Crime) పేర్కొంది. జే అండ్ కే ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన హర్యానా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ ఉదంతంపై జే అండ్ కే ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) హర్యానా అధికారులతో సంప్రదింపులు జరిపింది. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హర్యానా వర్గాలు హామీ ఇచ్చాయి. రాష్ట్రాల మధ్య ప్రయాణించే ప్రయాణికుల భద్రతపై ఈ ఘటన ఆందోళన కలిగిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande