గ్వాలియర్ రోడ్డు ప్రమాదంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దిగ్భ్రాంతి.. కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
గ్వాలియర్ రోడ్డు ప్రమాదంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దిగ్భ్రాంతి.. కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
nithin


గ్వాలియర్‌, 18 అక్టోబర్ (హి.స.)

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శీతలా మాతా ఆలయ సమీపంలో ధాన్యపు బస్తాల లోడుతో వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి భక్తులపైకి దూసుకెళ్లిన ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు.

ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నితిన్ గడ్కరీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande