టైగర్ ష్రాఫ్ కారు కాల్పుల ఘటన: ముగ్గురు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ముంబై పోలీసులు.
టైగర్ ష్రాఫ్ కారు కాల్పుల ఘటన: ముగ్గురు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ముంబై పోలీసులు.
టైగర్ ష్రాఫ్


ముంబై, 19 అక్టోబర్ (హి.స.)

బాలీవుడ్ ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ముంబైలోని జుహు ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ముంబై పోలీసులు ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 109(1), 3(5) మరియు ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆదివారం సాయంత్రం జుహులోని ఓ మైదానంలో ఫుట్‌బాల్ మ్యాచ్ ముగించుకుని తన కారులో బయలుదేరుతున్న టైగర్ ష్రాఫ్ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ముగ్గురు దుండగులు మోటార్ సైకిల్పై వచ్చి మూడు నుంచి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ప్రమాదంలో టైగర్ ష్రాఫ్ క్షేమంగా బయటపడగా, ఆయన డ్రైవర్, మరో వ్యక్తి గాయపడ్డారు. వెంటనే వారిని నాావతి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మరోవైపు, ఈ కాల్పుల ఘటనకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న గ్యాంగ్‌స్టర్లు అనిల్ పండిట్, హర్మన్ సంధు సోషల్ మీడియా వేదికగా బాధ్యత వహించినట్లు ప్రచారం జరుగుతోంది. సల్మాన్ ఖాన్‌తో పనిచేయవద్దని హెచ్చరించినప్పటికీ పెడచెవున పెట్టడం వల్లే ఈ దాడి చేసినట్లు వారు పేర్కొన్నారు. అయితే ఈ క్లెయిమ్స్‌పై పోలీసులు ఇంకా అధికారిక స్పష్టత ఇవ్వలేదు.

ఈ ఘటనను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తీవ్రంగా పరిగణించారు. ముంబై పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి తక్షణమే నిందితులను పట్టుకోవాలని, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిందితుల గాలింపు కోసం పోలీసులు సుమారు 15 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande