ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది.
Vote


అమరావతి , 20 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 659 మండలాల్లోని 9,829 ఎంపీటీసీ స్థానాలు, 659 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా అక్టోబర్ 21 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబర్ 24న నామినేషన్ల పరిశీలన, 25న తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీళ్లకు అవకాశం, 26న అప్పీళ్ల పరిష్కారం ఉంటాయి. అక్టోబర్ 27 వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు.

నవంబర్ 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అవసరమైన చోట నవంబర్ 4న రీపోలింగ్ చేపట్టనున్నారు. నవంబర్ 5న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలు ప్రకటించనున్నారు. ఎంపీటీసీ అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు పరిమితిని రూ.4 లక్షలుగా, జెడ్పీటీసీ అభ్యర్థులకు రూ.8 లక్షలుగా నిర్ణయించారు. ఎన్నికల నిర్వహణ కోసం రిటర్నింగ్ అధికారులను కూడా నియమించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande