ఏపీలో 25 వేలకు పైగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు
ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసే సమయానికి భారీ సంఖ్యలో దరఖాస్తులు అందాయి. అక్టోబర్ 20న ప్రచురితమైన నివేదిక ప్రకారం, వార్డు సభ్యుల స్థానాలకు 24,451 నామినేషన్లు, మేయర్ మరియు చైర్పర్సన్ పదవులకు కలిపి 1,358 నామినేషన్
Vote


అమరావతి , 20 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసే సమయానికి భారీ సంఖ్యలో దరఖాస్తులు అందాయి. అక్టోబర్ 20న ప్రచురితమైన నివేదిక ప్రకారం, వార్డు సభ్యుల స్థానాలకు 24,451 నామినేషన్లు, మేయర్ మరియు చైర్పర్సన్ పదవులకు కలిపి 1,358 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం నామినేషన్ల సంఖ్య 25,809గా నమోదైంది.

అక్టోబర్ 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. తొలి రోజున వార్డు సభ్యుల స్థానాలకు 641 నామినేషన్లు మాత్రమే అందగా, రెండో రోజున ఆ సంఖ్య 7,528కు పెరిగింది. చివరి రోజున అత్యధికంగా 16,282 నామినేషన్లు దాఖలైనట్లు నివేదిక తెలిపింది. గడువు ముగిసే సమయానికి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తమ పత్రాలను సమర్పించడంతో ఎన్నికల కార్యాలయాల్లో సందడి నెలకొంది.

రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్ పదవులకు 320 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 8,198 నామినేషన్లు అందినట్లు నివేదిక పేర్కొంది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో చైర్పర్సన్ పదవులకు 1,038 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 16,253 నామినేషన్లు నమోదయ్యాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande