మధ్యప్రదేశ్ రాజ్యసభ స్థానానికి ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల: నవంబర్ 12న పోలింగ్, లెక్కింపు
మధ్యప్రదేశ్ రాజ్యసభ స్థానానికి ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల: నవంబర్ 12న పోలింగ్, లెక్కింపు
ఎలక్షన్


భోపాల్, 22 అక్టోబర్ (హి.స.)

కేంద్ర మాజీ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన మధ్యప్రదేశ్ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ఉపఎన్నిక షెడ్యూల్‌ను ప్రకటించింది. నవంబర్ 12న ఈ స్థానానికి పోలింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపడతారు.

డాక్టర్ ఎల్. మురుగన్ 2024 ఏప్రిల్ 3న మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 2030 ఏప్రిల్ 2 వరకు ఉండగా, తమిళనాడులో పార్టీ బలోపేతంపై దృష్టి సారించేందుకు అక్టోబర్ 14న కేంద్ర మంత్రివర్గంతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. దీనితో ఈ స్థానం ఖాళీ అయినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

ఎన్నికల షెడ్యూల్ వివరాలు:

-

నోటిఫికేషన్ విడుదల: అక్టోబర్ 26

-

నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: నవంబర్ 2

-

నామినేషన్ల పరిశీలన: నవంబర్ 3

-

నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేదీ: నవంబర్ 5

-

పోలింగ్ తేదీ: నవంబర్ 12 (ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు)

-

ఓట్ల లెక్కింపు: నవంబర్ 12 సాయంత్రం 5 గంటల నుంచి

-

ఎన్నికల ప్రక్రియ పూర్తి: నవంబర్ 16 లోపు

అసెంబ్లీలో బలబలాలు – బీజేపీ విజయం దాదాపు ఖాయం

మధ్యప్రదేశ్‌లో మొత్తం 11 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న 230 మంది శాసనసభ్యుల బలాబలాలను పరిశీలిస్తే, బీజేపీకి 164 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్‌కు 65 మంది, భారత్ ఆదివాసీ పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఒక రాజ్యసభ స్థానాన్ని గెలుచుకోవడానికి కనీసం 116 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. సంఖ్యాబలం ప్రకారం ఈ ఉపఎన్నికలో అధికార బీజేపీ అభ్యర్థి విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande