ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ఖరారు - విద్యార్థులకు అలర్ట్
ఆంధ్రప్రదేశ్లో వచ్చే విద్యా సంవత్సరానికి (2026-2027) సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ను ఇంటర్ బోర్డు అధికారులు సిద్ధం చేశారు.
Exam


అమరావతి , 23 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో వచ్చే విద్యా సంవత్సరానికి (2026-2027) సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ను ఇంటర్ బోర్డు అధికారులు సిద్ధం చేశారు. విద్యార్థులు ఎలాంటి టెన్షన్ లేకుండా ముందుగానే ప్రణాళికాబద్ధంగా సిద్ధమయ్యేందుకు వీలుగా పరీక్షల తేదీలను ముందే ఖరారు చేశారు. దీని ప్రకారం 2027 ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు థియరీ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు బోర్డు ప్రకటించింది. జనవరి మాసంలోనే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విద్యార్థులుn సిలబస్ను త్వరగా పూర్తి చేసి రివిజన్పై దృష్టి పెట్టాలని విద్యాశాఖ సూచించింది. పరీక్షల నిర్వహణకు సంబంధించిన పూర్తి స్థాయి టైమ్ టేబుల్ను త్వరలోనే అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. ఈ ప్రకటనతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇప్పట్నుంచే పరీక్షల ప్రిపరేషన్లో నిమగ్నమయ్యారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande