నాచారం ఈఎస్ఐ ఆస్పత్రి కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల సమ్మె - వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు
హైదరాబాద్లోని నాచారంలో ఉన్న ఈఎస్ఐ (ESI) ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమ్మెబాట పట్టారు.
Doctors


హైదరాబాద్ , 23 అక్టోబర్ (హి.స.)హైదరాబాద్లోని నాచారంలో ఉన్న ఈఎస్ఐ (ESI) ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమ్మెబాట పట్టారు. గత నాలుగు నెలలుగా తమకు ఎలాంటి వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబాలను పోషించుకోవడం భారమైందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు అందక అప్పులపాలయ్యామని, అనేకసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో చేసేది లేక ఆస్పత్రి గేటు ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగామన్నారు. కార్మికుల సమ్మె కారణంగా ఆస్పత్రిలో రోజువారీ వైద్య సేవలు, పారిశుద్ధ్య నిర్వహణ పనులు పూర్తిగా నిలిచిపోయి రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. అత్యవసర విభాగానికి వచ్చే రోగులకు కూడా ఇబ్బందులు తలెత్తడంతో వైద్యాధికారులు ఆందోళనకారులతో చర్చలు జరిపారు. త్వరలోనే పెండింగ్ వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించి విధుల్లోకి చేరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande