
హైదరాబాద్ , 23 అక్టోబర్ (హి.స.)తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కార్మిక సంఘాల ఎన్నికలు ఇటీవల ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో విజయం సాధించిన నూతన నాయకులు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసి సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, దీర్ఘకాలిక డిమాండ్లు మరియు సంస్థ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. కార్మికులకు రావాల్సిన పీఆర్సీ బకాయిలు, హెల్థ్ కార్డ్స్ సమస్యలు, డ్యూటీ సమయాల సవరణ వంటి అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఆర్టీసీని లాభాల బాట పట్టించడంతో పాటు కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని మంత్రి వారికి భరోసా ఇచ్చారు. యూనియన్ నాయకులు కూడా సంస్థ ప్రగతికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్