రాజమహేంద్రవరంలో రాజకీయ మార్పు - వైఎస్సార్సీపీకి ఎదురుదెబ్బ
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Jagan


అమరావతి , 23 అక్టోబర్ (హి.స.)తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్సార్సీపీకి ఆ పార్టీ సీనియర్ నేత నందం స్వామి గుడ్ బై చెప్పి, అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. స్థానిక నాయకులు మరియు ప్రజాప్రతినిధుల సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకుని టీడీపీలో చేరగా, పార్టీ శ్రేణులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికాయి. గత కొంతకాలంగా స్థానిక పార్టీ నాయకత్వంతో వచ్చిన విభేదాలు మరియు అనుచరుల ఒత్తిడి మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పరిణామం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో వైఎస్సార్సీపీకి గట్టి ఎదురుదెబ్బగా భావిస్తుండగా, స్థానిక ఎన్నికల వేళ టీడీపీ బలపడేందుకు ఈ చేరిక దోహదపడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande