
హైదరాబాద్ , 23 అక్టోబర్ (హి.స.)తెలంగాణలో రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించిన పదవ తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. 2027 మార్చి నెలలో జరగనున్న టెన్త్ క్లాస్ వార్షిక పరీక్షలకు హాజరుకానున్న రెగ్యులర్ మరియు ప్రైవేట్ విద్యార్థులు పరీక్ష ఫీజులను చెల్లించేందుకు అధికారిక షెడ్యూల్ను బోర్డు అధికారులు ఖరారు చేశారు. విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా నిర్దిష్ట గడువులోగా తమ పాఠశాలల ద్వారా ఫీజులు చెల్లించాలని స్పష్టం చేశారు. ఆలస్యంగా చెల్లించే వారికి అపరాధ రుసుముతో కూడిన గడువు తేదీలను కూడా వేర్వేరుగా ప్రకటించారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన నామినల్ రోల్స్ నమోదు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులను విద్యాశాఖ ఆదేశించింది. విద్యార్థులు ఆఖరి నిమిషం వరకు ఎదురుచూడకుండా ముందే ఫీజులు చెల్లించి తమ హాల్ టికెట్లకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకోవాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్