
హైదరాబాద్, 24 అక్టోబర్ (హి.స.)
న్యూజిలాండ్తో చివరి వరకు ఉత్కంఠ గా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో టీమిండియా అద్భుత విజయం సాధించింది.
మ్యాచ్ ప్రారంభం నుండి తుది వరకు ఎంతో ఆసక్తికరంగా కొనసాగిన నేటి ఈ మ్యాచ్లో యువ ఆటగాళ్లు జట్టుకు మరపురాని విజయాన్ని అందించారు.
180 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆట మొదట్లో తడబడింది. అయితే మిడిల్ ఆర్డర్లో తిలక్ వర్మ(51), నితీష్ కుమార్ రెడ్డి(26) అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. వీరితో పాటు అంతకుముందు నమన్ ధీర్(31), అభిషేక్(27) కూడా మెరుగ్గా రాణించి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఫలితంగా టీమిండియా కేవలం 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు