ఆసియా పారా గేమ్స్ లో భారత క్రీడాకారులకు పథకాలు
ఆసియా పారా గేమ్స్ 2026 ఐచి-నగోయాలో జరుగుతున్న ఆసియా పారా గేమ్స్ 2026లో భారత క్రీడాకారులు పతకాల వేటలో దూసుకెళ్తున్నారు.
Games


న్యూఢిల్లీ, 19 అక్టోబర్ (హి.స.)

ఆసియా పారా గేమ్స్ 2026 ఐచి-నగోయాలో జరుగుతున్న ఆసియా పారా గేమ్స్ 2026లో భారత క్రీడాకారులు పతకాల వేటలో దూసుకెళ్తున్నారు. పోటీల తొలి రోజే పారా అథ్లెటిక్స్లో భారత అథ్లెట్లు సత్తా చాటారు. మహిళల 1500 మీటర్ల T12/T13 విభాగంలో సౌమ్య స్వర్ణం సాధించగా, రాధా వెంకటేష్ పతకం గెలుచుకున్నారు. పురుషుల జావెలిన్ త్రో F46 విభాగంలో రింకు, అజీత్ సింగ్ స్వర్ణ, రజత పతకాలను కైవసం చేసుకున్నారు. స్విమ్మింగ్లో రవి కార్తిక్ బుడిగిన రజతం సాధించారు. తొలి రోజు పోటీల్లో భాగంగా మోనా అగర్వాల్ స్వర్ణం, స్టార్ షూటర్ అవని లేఖర రజతం సాధించారు. పురుషుల T47 విభాగంలో నిషాద్ కుమార్ స్వర్ణంతో మెరిశారు. మహిళల 1500 మీటర్ల T11 విభాగంలో రవన్నీ వలసనైని కాంస్య పతకం గెలుచుకున్నారు. దీంతో భారత్ పతకాల సంఖ్య 11కు చేరింది. ఇందులో నాలుగు స్వర్ణాలు, ఐదు రజతాలు, రెండు కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande