
హైదరాబాద్, 25 అక్టోబర్ (హి.స.)
ఔటర్ రింగ్ రోడ్డు పై నేడు విషాద సంఘటన చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా పరిధిలోని కొల్లూరు సమీపంలో నేటి మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఓ ఆర్ పై ఉన్న చెట్లకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్ ను డీసీఎం అతివేగంతో ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో అశోక లేలాండ్ డీసీఎం వాహన డ్రైవర్‌తోపాటు చెట్లకు నీళ్లు పోస్తున్న వ్యక్తి కూడా మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. కాగా ప్రమాద సంఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు వారు వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..