సిద్ధిపేట అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక: ఎంపీ రఘునందన్ రావు
దేశవ్యాప్తంగా 25 సంవత్సరాల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన అంత్యోదయ స్ఫూర్తితో కూడిన కార్యక్రమాలను సిద్ధిపేటలోనూ అమలు చేయడం అభినందనీయమని ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు.
ఎంపీ


హైదరాబాద్, 25 అక్టోబర్ (హి.స.)

దేశవ్యాప్తంగా 25 సంవత్సరాల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన అంత్యోదయ స్ఫూర్తితో కూడిన కార్యక్రమాలను సిద్ధిపేటలోనూ అమలు చేయడం అభినందనీయమని ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు.

ఆదివారం సిద్ధిపేట పట్టణంలో బీజేపీ సీనియర్ నాయకులు ధూళి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అలయి, బలయి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించడమే అంత్యోదయ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

దేశ పురోగతికి ప్రజలందరి భాగస్వామ్యం అవసరమని, పండుగలు, సంప్రదాయాలు, సంస్కృతులు ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande