హైదరాబాద్ విమానాశ్రయంలో రూ.1.56 కోట్ల విదేశీ కరెన్సీ స్వాధీనం
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ మొత్తంలో విదేశీ కరెన్సీని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Kalaburagi: Two Arrested for Printing and Circulating Counterfeit Currency


హైదరాబాద్ , 25 అక్టోబర్ (హి.స.)

హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ మొత్తంలో విదేశీ కరెన్సీని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో సుమారు రూ.1.56 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేశారు. నిర్దిష్ట సమాచారం ఆధారంగా అధికారులు కౌలాలంపూర్కు వెళ్లే విమానంలో ప్రయాణించేందుకు సిద్ధమైన ఒక భారతీయ ప్రయాణికుడిని తనిఖీ చేశారు. అతడి క్యాబిన్ బ్యాగులో దుస్తుల మధ్య నల్లటి ప్లాస్టిక్ కవర్లలో దాచిన అమెరికన్ డాలర్లు, మలేషియా రింగిట్, సింగపూర్ డాలర్లు లభించినట్లు అధికారులు వెల్లడించారు. వీటి విలువ సుమారు రూ.63.6 లక్షలుగా అంచనా వేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande