కొమురం భీం వర్ధంతి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రేపు విద్యాసంస్థలకు సెలవు
ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం వర్ధంతిని పురస్కరించుకుని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు రేపు అనగా అక్టోబర్ 26 రోజున సెలవు ప్రకటించారు.
కొమరం భీమ్


ఆదిలాబాద్ జిల్లా, 25 అక్టోబర్ (హి.స.)

ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం వర్ధంతిని పురస్కరించుకుని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు రేపు అనగా అక్టోబర్ 26 రోజున సెలవు ప్రకటించారు.

జిల్లా అధికారుల నిర్ణయం మేరకు సోమవారం విద్యాసంస్థలకు సెలవు అమలు కానుంది. అయితే రెసిడెన్షియల్ పాఠశాలలకు మాత్రం ఈ సెలవు వర్తించదని అధికారులు స్పష్టం చేశారు. సెలవుకు ప్రత్యామ్నాయంగా నవంబర్ 14న విద్యాసంస్థలు పనిచేయాల్సి ఉంటుందని సూచించారు.

ఆదివాసీల హక్కుల కోసం అలుపెరగని పోరాటం మరియు గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన కొమరం భీమ్ వర్ధంతి సందర్భంగా ప్రతి ఏటా జోడేఘాట్లో స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తూ భీం చేసిన పోరాటాన్ని గుర్తుచేసుకుంటారు. భూమి, అటవీ వనరులపై హక్కులు, స్వయంపాలన కోసం ఆయన సాగించిన ఉద్యమం నేటి తరానికి స్ఫూర్తినిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande