
హైదరాబాద్, 25 అక్టోబర్ (హి.స.)
తెలంగాణ బీజేపీలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అధిష్ఠానం నుంచి పిలుపు రావడంతో రాష్ట్రానికి చెందిన పలువురు ముఖ్య నేతలు ఢిల్లీకి బయలుదేరారు.
ఢిల్లీలో నిర్వహించనున్న సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో పాటు ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నారు.
ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు సమాలోచనలు జరపనున్నట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు