ఆర్టీసీ బస్సులో చిల్లర వివాదం.. కండక్టర్ ను బస్సులో నుండి తోసివేసిన ప్రయాణికురాలు
హైదరాబాద్, 25 అక్టోబర్ (హి.స.) ఆర్టీసీ బస్సులో చిల్లర విషయంలో ప్రయాణికురాలికి మరియు లేడీ కండక్టర్కు మధ్య జరిగిన వివాదం లో విషాదం చోటుచేసుకుంది.మణుగూరు డిపోకు చెందిన కండక్టర్ ప్రవల్లిక.. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలి కుమారుడికి ఆఫ్ టికెట్ ఇచ
Conductor


హైదరాబాద్, 25 అక్టోబర్ (హి.స.)

ఆర్టీసీ బస్సులో చిల్లర విషయంలో ప్రయాణికురాలికి మరియు లేడీ కండక్టర్కు మధ్య జరిగిన వివాదం లో విషాదం చోటుచేసుకుంది.మణుగూరు డిపోకు చెందిన కండక్టర్ ప్రవల్లిక.. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలి కుమారుడికి ఆఫ్ టికెట్ ఇచ్చే క్రమంలో ప్రారంభమైన వివాదంలో కండక్టర్ను సదరు ప్రయాణికురాలు బస్సులో నుండి తోసివేయడం జరిగింది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనలో కండక్టర్ కాలు పై నుండి బస్సు టైర్ వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ కండక్టర్ను భద్రాచలం లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు మరియు సంఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande