అంగన్వాడీ కేంద్రంలో పాము కాటుకు బాలిక మృతి: ఖమ్మం జిల్లా కేవీపల్లిలో ఉద్రిక్తత
ఖమ్మం జిల్లా కేవీపల్లిలోని అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది.
Unidentified dead body


ఖమ్మం , 27 అక్టోబర్ (హి.స.)

ఖమ్మం జిల్లా కేవీపల్లిలోని అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కేవీపల్లికి చెందిన ఐదేళ్ల చిన్నారి ధన్యశ్రీ అంగన్వాడీ కేంద్రంలో ఉండగా పాము కుట్టింది. చిన్నారి అస్వస్థతకు గురికావడంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చిన్నారి ఈరోజు కన్నుమూసింది.

చిన్నారి మృతి వార్త విన్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అంగన్వాడీ కేంద్రం నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని ఆరోపిస్తూ చిన్నారి మృతదేహంతో అంగన్వాడీ కేంద్రం ఎదుట ధర్నాకు దిగారు. బాధ్యులైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ధర్నా నిర్వాహకులతో చర్చలు జరిపి, న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande