
హైదరాబాద్, 27 అక్టోబర్ (హి.స.)
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ డీలర్ల సమస్యలను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.
పౌరసరఫరాల సంస్థ అప్పుల భారం, బియ్యం నిల్వల నిర్వహణ, రేషన్ డీలర్ల వేతనాలపై ప్రభుత్వ తీరును ఆయన ప్రశ్నించారు. డీలర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు.
పౌరసరఫరాల కార్పొరేషన్ భారీ అప్పుల్లో కూరుకుపోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలే కారణమని హరీశ్ రావు ఆరోపించారు. సంస్థపై లక్ష కోట్ల రూపాయల అప్పుల భారం ఉందని పేర్కొన్నారు.
అంతేకాకుండా రూ.600 కోట్ల విలువైన బియ్యం వృథా అయిందన్న అంశాన్ని ప్రస్తావిస్తూ నిల్వల నిర్వహణపై ప్రభుత్వాన్ని నిలదీశారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17,200 మంది రేషన్ డీలర్లకు వేతనాలు చెల్లించే విషయంలో ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు