హైదరాబాద్లోని నాలుగు ప్రధాన ప్రాంతాల్లో భారీ శబ్దాలు: భయాందోళనకు గురై రోడ్లపైకి వచ్చిన ప్రజలు
హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం వింతైన మరియు అత్యంత భారీ శబ్దాలు వినిపించడం తీవ్ర కలకలం రేపింది.
TELANGANA police


హైదరాబాద్ , 27 అక్టోబర్ (హి.స.)

హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం వింతైన మరియు అత్యంత భారీ శబ్దాలు వినిపించడం తీవ్ర కలకలం రేపింది. నగర పరిధిలోని ఉప్పర్పల్లి, ఎర్రబోడ, లంగర్హౌస్ మరియు కేశవస్వామి నగర్ ప్రాంతాలలో ఉదయం సుమారు 9.15 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడును తలపించే శబ్దాలు వచ్చాయని స్థానికులు తెలిపారు. ఒకేసారి గట్టి శబ్దం రావడంతో భూకంపం ఏమైనా వచ్చిందా లేదా ఏదైనా భూగర్భ పేలుడు సంభవించిందా అని భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. స్థానిక పరిసరాల్లోని కొన్ని గృహాల కిటికీల అద్దాలు, గృహోపకరణాలు కూడా ఈ శబ్దాల ధాటికి స్వల్పంగా స్పందించినట్లు నివాసితులు పేర్కొన్నారు.

ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే రంగంలోకి దిగి ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి. శబ్దాలు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపై అధ్యయనం చేస్తున్నారు. సమీపంలోని క్వారీల్లో జరిపిన బ్లాస్టింగ్ల వల్ల ఈ శబ్దాలు వచ్చాయా లేక వాతావరణంలో సంభవించిన సూపర్సోనిక్ బూమ్ లేదా వాయుసేన విమానాల విన్యాసాల వల్ల జరిగాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, శాంతిభద్రతల పరంగా ఎలాంటి ప్రమాదం లేదని పోలీసులు స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande