
హైదరాబాద్, 27 అక్టోబర్ (హి.స.)
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ మంగళవారం కోకాపేట్, నార్సింగి ప్రాంతాల్లో పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిశీలించారు.
రహదారి భద్రత, నాలా అభివృద్ధి, బాక్స్ కల్వర్టు నిర్మాణానికి సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
కోకాపేట్‌లోని డీఎస్ఆర్ అపార్ట్మెంట్స్ సమీపంలో తరచూ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఎమ్మెల్యేకు వివరించారు. వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని లేదా ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
అలాగే సమీపంలోని రాక్వెల్ పాఠశాలకు వచ్చే విద్యార్థులు రహదారి దాటే సమయంలో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు